కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర చేస్తున్నాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆరోపించారు. ఇటీవల ముడా స్కామ్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సిద్ధరామయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రిలీప్ దొరికింది.