విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఓ అదిరిపోయే ఐడియా చెప్పారు.. ముడి చమురు దిగుమతిని తగ్గించాలని సూచించారు.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి పునరుత్పాదక శక్తి వైపుకు అడుగులు వేయాలన్నారు.. సాంప్రదాయ ఇంధన వనరుల నుండి పునరుత్పాదక ప్రత్యామ్నాయాలకు మారాలని.. అప్పుడే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుందన్నారు..
సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన.. హరిబాబు ఇంటికి వెళ్లారు.. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు.. విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు..