Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది. లావేరు మండలం మురపాక పంచాయతీలోని గుంటుకుపేటలో సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో మద్యం వ్యానులో దుకాణం వద్దకు చేరుకున్న 11 మంది అక్కడ కాపలాగా ఉన్న ప్రసాద్, దుర్గారావులను సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లి తాళ్లతో బంధించారు. అనంతరం మద్యం దుకాణంలోకి ప్రవేశించి రూ. 11.57 లక్షల విలువైన మద్యం బాటిళ్లను దుండగులు అపహరించుకుపోయారు. Read…