Manmohan Singh: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని శనివారం ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల దర్శనార్థం ఉంచనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం అధిపతి పవన్ ఖేడా తెలిపారు. డిసెంబర్ 28న ఉదయం 8 గంటలకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. శనివారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నివాళులర్పించేందుకు ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం…