CM Chandrababu: జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నెల నవంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ నోటిఫికేషన్‌పై నెల రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించిన ప్రభుత్వం, నిర్దేశించిన గడువును నేటితో ముగించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927…