విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపింది. మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిందని వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది.
Mid Day Meal In Colleges: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుండి మధ్యాహ్న భోజనం అందించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రారంభచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విజయవాడ పాయకాపురం నుండి మంత్రి లోకేశ్…
తెలంగాణ విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నేడు ప్రభుత్వ జూనియర్ కాలేజి ల ప్రిన్సిపాల్స్ కలవనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజి లను నడపలేము. ఫ్యాకల్టీ లేక క్లాస్ లు నడవడం లేదు అని ప్రిన్సిపాల్స్ తెలిపారు. కాలేజి ల నుండి పిల్లలు తల్లిదండ్రులు టిసిలు తీసుకొని వెళ్లిపోతామంటున్నారు పదుల సంఖ్యలో కాలేజి లు గెస్ట్ లెక్చరర్ లతో నడుస్తున్నాయి అని తెలిపారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 90 శాతం గెస్ట్ ఫ్యాకల్టీతోనే నడిపిస్తున్నారు.…