అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో 78 మందితో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలు అందరూ రాశాడు. తాజాగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈ 78 మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థిని ఆనందల మల్లికకు 294 మార్కులు వచ్చాయి. మిగతా 77 మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిలయ్యారు. జూనియర్ కాలేజీ లో ప్రిన్సిపాల్, లెక్చలర్లు లేకపోవడంతో ఉత్తీర్ణశాతం పూర్తిగా దెబ్బతింది.