Telangana Joint Staff Council Appointed: ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈ మేరకు తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లభించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియామకం చేపట్టింది. అందులో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తో పాటు మరికొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మరో ఆరు సంఘాలకు రొటేషన్ పద్దతిలో ఆహ్వానించనుంది.