కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యటకులకు తగిన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై తెలంగాణ పర్యటక శాఖ అధికారులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. READ MORE: Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు…
అన్నమయ్య జిల్లా గువ్వలచెరువు ఘాట్‌లో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 108 అంబులెన్స్ పైలట్ రమేష్ ఈరోజు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన 108 అంబులెన్స్ పైలట్ రమేష్ కుమార్ భార్య అనూషతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్‌లో మాట్లాడారు.