ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల బలోపేతంపై చర్చించారు. వాటి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం దిశగా సీఎం జగన్ చర్చించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు రంగం సిద్దం చేసారు. సభను తప్పు దోవ పట్టించారన్న శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుపై అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు సభకు సిఫార్సు చేయనుంది ప్రివిలేజ్ కమిటీ. మద్యం షాపుల విషయంలో అచ్చెన్న, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని నిర్ధారించింది ప్రివిలేజ్ కమిటీ. స్పీకరును దూషించారనే ఫిర్యాదులో అచ్చెన్నాయుడు క్షమాపణలను పరిగణనలోకి తీసుకుని ప్రివిలేజ్ కమిటీ క్షమించింది అన్నారు. ఇక ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్…