గోషామహల్. హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గాల్లో రాజకీయ వేడి ఎక్కువగా ఉన్న సెగ్మెంట్. గత ఎన్నికల్లో బిజెపి నుంచి రాజాసింగ్ గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు ఇదే. అక్కడ ఓడిన టీఆర్ఎస్‌లో మాత్రం ఇప్పటికీ సీన్ మారలేదట. ఆ ఎన్నికల్లో నాయకులు ఏవిధంగా అయితే తన్నుకున్నారో.. ఇప్పుడూ అదే పరిస్థితి ఉందట. నేతలు ఎక్కువైపోయారు. కేడర్‌ను పట్టించుకోవడం లేదు. పైగా ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారే…
ఆయన చేసే కామెంట్స్ విపక్షాలకు అస్త్రాలుగా మారితే.. సొంత పార్టీ ఇరుకున పడుతోందా? సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? మీడియా అటెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్‌పై రచ్చదేశంలో ఉత్తరప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని.. కొత్తగా పాగా వేయాలని బీజేపీ అధిష్ఠానం వేయని ఎత్తుగడలు లేవు. ప్రధాని మోడీ, అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్, జేపీ నడ్డాలు…
తెలంగాణలో నిరుద్యోగ దీక్షకు దిగింది బీజేపీ. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. మంత్రి కేటీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’ను అవమానిస్తూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ పేరుతో చేసిన విమర్శలు చేయడం ముమ్మాటికీ నిరుద్యోగులను అవమానించడమే.…
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తన నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీతో చర్చించాలని అపాయింట్ మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరడం లేదన్నారు. సభలో మీరు గతంలో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను కలవవచ్చని, మాట్లాడవచ్చన్నారు. అసెంబ్లీ కార్యక్రమాల తర్వాత వందల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. మీకు ఫోన్ చేసినా కలవలేదు. మీ ఓఎస్డీకి ఫోన్ చేస్తే ఎప్పుడైనా…
తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. గోషామహల్ అభివృద్ది కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తన నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని, వారి కోరిక మేరకు రాజీనామా చేస్తానని చెప్పారు. ఉపఎన్నిక వస్తే కానీ బడుగులు, రైతులపై కేసీఆర్ కు ప్రేమ రావడం లేదని ఇటీవలే ఉపఎన్నికల హామీలను ఉద్దేశించి రాజాసింగ్ ఎద్దేవా చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ రూ. 10 లక్షల చొప్పున…