Minister Lokesh: విశాఖపట్నానికి ఐటీ దిగ్గజం గూగుల్ రాకపై ఏపీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చింది.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయి.. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు.. ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని తెలిపారు.