Viral News: ఇటీవల కాలంలో అడ్రస్ కనుక్కోవడం చాలా సులభంగా మారింది. గూగుల్ మ్యాప్స్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయంలో సరైన మార్గాలను ఎంచుకోవడం సులభంగా మారింది. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో మాత్రం గూగుల్ తల్లిని నమ్ముకుని వెళ్తే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కొల్పోయిన వాళ్లు ఉన్నారు. మరికొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్తే, చివరకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడేయడం మనం చూస్తున్నాం.