వన్డే ప్రపంచకప్ లో భాగంగా రేపు(గురువారం) ఇండియా- బంగ్లాదేశ్ మధ్య జరుగనుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ ఇరుజట్లు తలపడనున్నాయి. అయితే ఈ మైదానంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట మంచి రికార్డులు ఉన్నాయి. అతని వన్డే గణాంకాలు చాలా ఆకట్టుకున్నాయి. ఈ మైదానంలో వన్డేల్లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు.