జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తన నెక్స్ట్ మూవీ ‘గుడ్ లక్ సఖి’లో షూటర్‌గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ట్రైలర్ జగపతి బాబుతో మొదలవుతుంది. భారతదేశం గర్వించదగ్గ అత్యుత్తమ షూటర్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆది పినిశెట్టి సఖి (కీర్తి సురేష్) అనే పల్లెటూరి అమ్మాయిని సూచిస్తాడు. ఊరిలో అందరూ ఆమెను దురదృష్టవంతురాలిగా చూస్తారు. జగపతి బాబు ఆమెకు శిక్షణ…