బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 20 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ బంగారం వినియోగదారులను కలవరపాటుకు గురిచేస్తూ ఉంటుంది. లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాక చివరకు నకిలీ బంగారమని తేలితే తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు నిజమైనవా లేదా ఎవరైనా నకిలీ ఆభరణాలను విక్రయిస్తున్నారా అనే ఆందోళన ఉంటుంది. కల్తీ లేదా నకిలీ హాల్‌మార్క్ చేసిన ఆభరణాల కేసులు కూడా మార్కెట్లో…