గోదావరి, కృష్ణ జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ జలాలపై సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.. తాము కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన.. రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎంల బండారం బయట పడుతుందని వ్యాఖ్యానించారు.. రెండు రాష్ట్రాల సీఎంలు కమిషన్ ల కోసం పని చేస్తున్నారని ఆరోపించిన బండి…