గోదావరి, కృష్ణ జలాలపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి, కృష్ణ జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ జలాలపై సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.. తాము కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన.. రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎంల బండారం బయట పడుతుందని వ్యాఖ్యానించారు.. రెండు రాష్ట్రాల సీఎంలు కమిషన్ ల కోసం పని చేస్తున్నారని ఆరోపించిన బండి సంజయ్.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అడ్డుకోవడానికి కేంద్రం నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు.. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో కేసీఆర్ పట్టించుకోవడం లేదు.. అందుకే జగన్ దోచుకుపోతున్నారన్న ఆయన.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.
కృష్ణ పరివాహన ప్రాంతం 68 శాంతం ఉంటే.. తెలంగాణకి 575 టీఎంసీ నీరు రావాల్సిన ఉంటే.. 299 టీఎంసీల నీరు ఎలా ఒప్పుకున్నారంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు బండి సంజయ్.. కమిషన్‌ల కోసం పక్క రాష్ట్రంతో కుమ్మక్కయ్యారని ఆరోపించిన ఆయన.. బహిరంగంగా ఎవరి వాటా ఎంత అనేది మేం చెబుతున్న సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సీఎం లెటర్ రాశారు.. మరి సుప్రీంలో కేసు వేస్తే ఎలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు అని.. ఆ కేసును కూడా 8 నెలల తరువాత వాపస్ తీసుకున్నారని తెలిపారు.. ఇక, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించిన బండి.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం కేసీఆర్‌కు పాల్గొనేందుకు సమయం లేదంట? వాయిదా వేయించారు అంటూ ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. కానీ, తెలంగాణకు అన్యాయం జరిగితే తప్పకుండా బీజేపీ అండగా ఉంటుందన్నారు.. అంత హుజురాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల హైడ్రామా..? అని ఆరోపించిన ఆయన.. 299 టీఎంసీల నీరు ఎలా ఒప్పుకున్నాడని కేసీఆర్ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Tags
- Godavari Board
తాజావార్తలు
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!