Goa Politics: గోవాలో కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఈ ఏడాది మొదట్లో గోవాలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి చతికిలపడింది. ఇదిలా ఉంటే గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, కేదార్ నాయక్, రాజేష్ ఫాల్దేశాయ్, సంకల్ప్ అమోంకర్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, అలెక్సో సిక్వేరాలు కాంగ్రెస్ శాససభా…