Megastar Chiranjeevi: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిరంజీవి అత్యంత గౌరవప్రదమైన అవార్డును అందుకున్నారు. కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, మురుగన్ చేతుల మీదుగా ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకలు గోవాలో జరగనున్న విషయం తెల్సిందే. భారత 53వ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.