Today (11-02-23) Business Headlines: బెల్జియం, తెలంగాణ ఒప్పందం: లైఫ్ సైన్సెస్ రంగంలో బెల్జియంకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. బెల్జియం దేశంలోని ఫ్లాండర్స్ అనే ప్రాంతంలో సుమారు 350 లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. బయోఏషియా-2023కి ఫ్లాండర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ పార్ట్నర్. ఈ నేపథ్యంలో ఫ్లాండర్స్ ఇన్వెస్ట్’మెంట్ అండ్ ట్రేడ్’తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపింది. తద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోనుంది.