యంగ్ హీరోయిన్ రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘ధామ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఇప్పుడు మరో పది రోజుల్లో ‘గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, తెలుగులో నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. Also…