టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న మిరాయ్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, తాను రచించిన ‘ది బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్’ పుస్తకాన్ని కాపీ చేసి సినిమా తీశారని ఆరోపించారు. మిరాయ్ మేకర్స్ కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు.పిటిషనర్ గిరిధర్ తన పుస్తకంలోని కథాంశం, పాత్రలు, సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారని వాదిస్తున్నారు. దీంతో సినిమా డైరెక్టర్, నిర్మాతతో పాటు ఇతర సంబంధిత వ్యక్తులను…