మనం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మెడికల్ షాపు దగ్గరికి వెళతాం. అక్కడ వారిచ్చే మందులు వాడేస్తాం. కానీ మనం మందుల షాపుకి వెళ్లకుండానే మన వంటింట్లో వుండే సహజ ఔషధాలను వాడాలని అనుకోం. మన నాన్నమ్మలు, అమ్మమ్మలు వందేళ్ళు బతికిన సందర్భాలున్నాయి. వారి ఆరోగ్య రహస్యం వంటిల్లే అంటే నమ్ముతారా? వారు పదిమంది పిల్లల్ని కన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సలక్షణంగా జీవించారు. నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు…
చలికాలంలో ఆరోగ్యం పరిరక్షించుకోవడం ఎంతో అవసరం. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటూ వుంటుంది. మన ఆహారంలో అల్లం ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అల్లంని క్రమం తప్పకుండా వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం కూరగాయల కొనేటప్పుడు తప్పనిసరిగా అల్లం కొంటుంటాం.…