త్తర ప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా ఎన్డీయే - ఇండియా కూటముల మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి భవిష్యత్ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత.. 28 మంది సభ్యుల కూటమి మొదటి పరీక్షను ఎదుర్కొంటోంది.
Ghosi Bypoll: అధికార బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమికి మధ్య తొలిపోరు ఖరారైంది. ఇందుకు వేదికగా ఘోసి ఉపఎన్నిక మారనుంది. ఉత్తర్ ప్రదేశ్ ఘోసి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, టీఎంసీ వంటి మొత్తం 30కి పైగా ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పేరుతో జట్టు కట్టాయి.