తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్ ఎత్తేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు ఎప్పటిలా కొనసాగుతున్నాయి. GHMC కౌన్సిల్ సమావేశం మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అన్‌లాక్‌లో ఎందుకు వర్చువల్ మీటింగ్ పెట్టారు? విపక్షాల విమర్శలేంటి? ఆన్‌లైన్ కౌన్సిల్ మీటింగ్ లోగుట్టు ఏంటి? వర్చువల్‌గా ముగిసిన జీహెచ్‌ఎంసీ తొలి కౌన్సిల్ భేటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా GHMC కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కౌన్సిల్‌లో విస్తృతంగా చర్చించి ఆయా అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.…