Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. ఈ రెండు కేసులను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అందిన సమాచారం ప్రకారం పోలీసులు, ఆర్మీ పెట్రోలింగ్ బృందం జమ్మూలోని ఘరోటా ప్రాంతంలో రోడ్డు పక్కన అనుమానాస్పద వస్తువును కనుగొన్నారు. అయితే దానిని పరిశీలించగా అది పేలుడు పదార్థంగా అనుమానించారు. ఈ…