“ధారుణి రాజ్యసంపద మదంబున…” అంటూ ఆదికవి నన్నయ్య పలికించిన పద్యాన్ని, నటరత్న యన్.టి.రామారావు అభినయానికి అనువుగా ఆలపించినా, “కుడి ఎడమైతే… పొరబాటు లేదోయ్…” అంటూ నటసమ్రాట్ ఏ.నాగేశ్వరరావు నటనకు ప్రాణం పోసినా- వాటిలో తనదైన గళమాధుర్యం నింపుతూ ఘంటసాల వేంకటేశ్వరరావు సాగారు. ఘంటసాలను స్మరించిన ప్రతీసారి ఆ మహానటులిద్దరూ గుర్తుకు రాకమానరు. ఆ ఇరువురి అభినయాన్ని గుర్తు చేసుకున్న సమయాల్లో ఘంటసాల మాస్టర్ జ్ఞప్తికి రావలసిందే! నటరత్న, నటసమ్రాట్ అభినయవైభవంలో ఘంటసాల గానానికీ ప్రత్యేకమైన భాగముందని చెప్పవచ్చు.…
మరపురాని మధురగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శతజయంతి డిసెంబర్ 4న మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ‘ఘంటసాల శతజయంతి ఉత్సవాలను’ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడానికి సంకల్పించారు. ఈ విషయం తమకెంతో ఆనందం కలిగిస్తోందని ఘంటసాల సతీమణి సావిత్రమ్మ అన్నారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సావిత్రమ్మ. ఆమె అనారోగ్య కారణంగా ఓ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలుపగా, ఆమె సందేశాన్ని ఘంటసాల రెండవ కూతురు సుగుణ చదివి వీడియో ద్వారా పోస్ట్…