Sunspot: సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో చివరి దశలకు చేరుకున్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలం క్రమంగా అలజడిగా మారుతోంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం సన్‌స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలు ఎక్కువ అవుతున్నాయి. సూర్యుడిపై ఏర్పడే భారీ పేలుళ్ల కారణంగా పదార్థం అంతరిక్షంలోకి వెదజల్లబడుతోంది. దీని కారణంగా భూమిపై సౌరతుఫానులకు ఏర్పడుతున్నాయి.
Powerful flare from Sun hits Earth: సూర్యుడి నుంచి వెలువడిన శక్తివంతమైన సౌరజ్వాల భూమిని మార్చి 29న ఢీకొట్టింది. శక్తివంతమైన ఆవేశపూరిత కణాలు కలిగిన ఈ సౌరజ్వాల భూ వాతావరణంలోని పై పొరను అయనీకరించింది. దీనివల్ల ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో షార్ట్ వేవ్ రేడియో బ్లాక్ అవుట్ కు దారి తీసింది. సూర్యుడిపై ఉన్న సన్‌స్పాట్ AR3256 నుంచి ఈ సౌరజ్వాల వెలువడింది. శక్తివంతమైన పేలుడు కారణంగా ఇలా సౌర జ్వాలలు భూమివైపు దూసుకువస్తుంటాయి.
Massive 'Hole' Spotted on Sun's Surface: సౌరకుటుంబానికి మూలం సూర్యుడు. ఈ గ్రహాలను తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సూర్యుడిపై భారీగా ఏర్పడిన నల్లటి ప్రాంతాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి కన్నా 20 రెట్లు పెద్దగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి భారీ బ్లాక్ స్పాట్లను ‘‘కరోనల్ హోల్’’గా పిలుస్తారు. భారీ సూర్యుడి వెలుగుల మధ్య నల్లటి ప్రాంతం ఓ రంధ్రంగా కనిపిస్తుంటుందని అందుకనే వీటిని కరోనాల్ హోల్…