Israel-Lebanon Tention: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయిల్ దాడుల్లో మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా ధ్రువీకరించింది. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్‌లో అతను మరణించాడు. ఇదిలా ఉంటే ఈ దాడిలో ఒక ఇరాన్‌కి చెందిన ఓ సీనియర్ మిలిటరీ జనరల్ కూడా నస్రల్లాతో కలిసి మరణించినట్లు రిపోర్ట్ చెబుతున్నాయి.