నేపాల్‌లో ఒక రోజంతా అల్లకల్లోలం తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించింది. నిరసనకారులు తిరిగి రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విధ్వంసం, దహనం సంఘటనలపై దర్యాప్తుకు ఆదేశించింది. హింసాత్మక నిరసనలపై, ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి మాట్లాడుతూ.. ఈ నిషేధం నిజమైన ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిరసనకారుల చొరబాటు కారణంగా భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని అర్ధరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రధాన మంత్రి ఓలి తెలిపారు. ఖాట్మండుతో…
Gen Z protest in Nepal: నేపాల్‌లో అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ‘జనరేషన్ – జెడ్ (Gen Z) విప్లవం’గా పేరుపొందింది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంటు సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 16 మంది నిరసనకారులు మరణించగా, వందలాది…