ఏపీకి అత్యంత కీలకమైన పోర్టుల్లో గన్నవరం పోర్టు ఒకటి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ పోర్టు ప్రస్తుతం పూర్తిగా ప్రైవేటుపరం అవుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి హిటెక్కుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారుకు ప్రస్తుతం గన్నవరం పోర్టు ప్రైవేటు చేతిలోకి పోతుండటంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి ఏజెండాగా ముందుకెళుతోంది.…