ఏఓబీ ఆంధ్రా ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి, బెంగూళూరు, గోవా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రగ్స్‌ను ఎక్సైజ్, ఎన్ ఫోర్స్‌మెంట్ పోలీసులు ఎంతో శ్రమకు ఓర్చి పట్టుకున్నారు. 703 కేసుల్లో పట్టుబ డిన 7951 కేజీల గంజాయిని, డ్రగ్స్‌ను కాల్చేశారు. దహనం చేసిన గంజాయి, డ్రగ్స్ విలువ రూ.11,61,90,294 ఉంటుంది.