Gangula Kamalakar:డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు… ఏమైంది? అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగుసార్లు వరుసగా నన్ను గెలిపించారు.. ఈ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు పాదాభివందనాలని అన్నారు. అత్యంత గట్టి పోటీ నడుమ… ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ నాలుగోసారి నన్ను గెలిపించడం సాధారణ విషయం కాదని తెలిపారు. బండి సంజయ్ లాంటి జాతీయ స్థాయి నేత, కాంగ్రెస్…