హిందూపురం గ్యాంగ్ రేప్‌పై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ స్పందించారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్ అత్యంత దుర్మార్గం, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడలిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్ మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని ఆరోపించారు. బోండా ఉమ మహిళా కమిషన్ సుప్రీమా అంటున్నారని.. బోండా ఉమ లాంటి ఆకు రౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమేనని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాధితులను ఎలా పరామర్శించాలో కూడా…
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నున్న పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు విధించారు. తమ కుమార్తె కనిపించలేదన్న బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం…