గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆగడాలతో ఐదేళ్ల పాటు జనాలు సరిగా గణేష్ ఉత్సవాలు కూడా జరుపుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు డూండీ గణేష్ ఉత్సవాలు జరగనివ్వకుండా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. వినాయకుడు అంటే తమషా కాదు అని.. వడ్డీతో సహా వసూలు చేస్తాడు అని వార్నింగ్ ఇచ్చారు. డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో సితార సెంటర్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి…
CM Chandrababu Visits 72 ft Ganesh idol in Vijayawada: బెజవాడలో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి మట్టి విగ్రహంను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. భవిత్యత్తులో ఏపీకి ఏ ఇబ్బందులు రాకుండా తొలగిపోవాలని వినాయకుడిని కోరుకున్నానని తెలిపారు. ఏపీ ప్రజలు…
126 feet Tallest Ganesh Idol Unveiled in Anakapalli: అనకాపల్లి జిల్లాలో మొట్టమొదట సారిగా దేశంలోనే అత్యంత ఎత్తైన గణనాథుడు ఈసారి కొలువు దీరాడు. అనకాపల్లి పట్టణం ఇప్పుడు దేశం చూపును ఆకర్షిస్తోంది. ఇక్కడ 126 అడుగుల భారీ శ్రీలక్ష్మీ గణపతి విగ్రహంను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి పెద్దదైన మట్టితో తయారు చేసిన ఈ గణేష్ విగ్రహం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి గణేష్ విగ్రహాన్ని ప్రముఖ…
వినాయక చవితి పండగ పూట కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్‌లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఏడిద చరణ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. చరణ్ కుటుంబానికి…
దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఊరు వాడల్లో వెలిసిన మండపాల్లో వినాయకుడు కొలువుదీరాడు. అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటున్నారు గణపయ్య భక్తులు. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ భారతదేశంలో అతిపెద్ద పండుగలలో ఒకటి. కానీ గణేష్ చతుర్థి పండుగ భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా జరుపుకుంటారని మీకు తెలుసా. అవును, భారతదేశం కాకుండా, గణేష్ చతుర్థి జరుపుకునే ఇతర దేశాలు ఉన్నాయి. ఇక్కడ గణేష్ చతుర్థి పండుగను వైభవంగా…
Ganesh Chaturthi 2025 Shubh Muhurat and Timings: ప్రతి సంవత్సరం వినాయక చవితి (గణేష్ చతుర్థి) భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తేదీన వస్తుంది. 10 రోజుల అనంతరం గణేష్ పండుగ అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఆగస్టు 27 నుంచి ప్రారంభమై.. సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుంది. వినాయక చవితికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో.. గణనాథుడిని పూజించడానికి ఊరూ వాడా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో…
హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో గణేష్ చతుర్థి ఒకటి. ఈ పండుగ సందర్భంగా జరిగే గణేష్ నవరాత్రులు భాద్రపద మాసంలో చతుర్థి తిథి నుంచి మొదలై అనంత చతుర్దశి తిథి వరకు కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత పదవ రోజు జరిగే గణేశ్ నిమజ్జనంతో పండుగ ముగిసిపోతుంది. తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి తిథి ఆగస్టు 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:54 గంటలకు…
Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థిని వినాయక చవితి అని కూడా అంటారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి రోజు వినాయకుడు జన్మించాడని చెబుతారు. అందుకే ఏటా ఇదే రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ 27 ఆగష్టున వచ్చింది. అంటే రేపే వినాయక చవితి. వినాయక చవితి వేడుకలు పది రోజుల పాటు జరుపుకుంటారు.
Ganesh Chaturthi 2025: రాష్ట్రవ్యాప్తంగా ఊరూ-వాడ వినాయక చవితి సందడి నెలకొంటోంది. బొజ్జగణపయ్య ప్రతిష్ఠాపనకు పెద్దసంఖ్యలో మండపాలు కొలువుదీరుతున్నాయి. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలసికట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చిన్నారులలో వినాయక చవితి వేడుకలు పట్టలేనంతా ఉత్తేజాన్ని నింపుతాయి. ఇటు మండప నిర్వాహకులు.. అటు పోలీసు, మున్సిపాలిటీ, జల మండలి, విద్యుత్ విభాగాల అధికారులంతా చవితికి పక్షం రోజుల ముందు నుంచే నిమజ్జనం వరకు ఏర్పాట్లలో మునిగిపోతారు..…
Ganesh Chaturthi 2025: MCRHRD లో గణేష్ ఉత్సవాలు 2025 పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్.. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు హైదరాబాద్ ,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇంకా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. INDIA Bloc: ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తుషార్!…