ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా పలు చిత్రాలలో నటించాడు. ఇప్పుడు సురేశ్ రెండో కుమారుడు గణేశ్ సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గణేశ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ‘స్వాతి ముత్యం’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం…