ఆ ఎమ్మెల్యే పరిస్థితి అడుసు తొక్కనేల-కాలు కడగనేల అన్నట్టుగా ఉందా? ఏరికోరి వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న నాయకులే ఆయన కింద గోతులు తీస్తున్నారా? వివిధ వర్గాల్లో ఆయనంటే ఏవగింపు కలిగేలా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారా? సన్నిహితులకు విషయం తెలిసి కూడా… శాసనసభ్యుడి ఒంటెద్దు పోకడల కారణంగా చెప్పలేకపోతున్నారా? ఎవరాయన? ఏదా గోతులు తీసే బ్యాచ్? గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ ఫస్ట్ టైం శాసనసభ్యుడు… నియోజకవర్గం అభివృద్ధి మీద…