ఈనెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచంలోని దాదాపు 200 దేశాల నుంచి వేలాదిమంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ట్యోక్యో చేరుకున్నారు. ప్రస్తుతం ఆరు రోజులుగా క్రీడలు జరుగుతున్నాయి. క్రీడలు ప్రారంభానికి ముందే ఆ దేశంలో కరోనా కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. ఇక రాజధాని టోక్యోలో కేసులు క్రమంగా పెరిగే అవకాశం ఉందని క్రీడలు ప్రారంభానికి ముందే నిపుణులు హెచ్చరించారు. కాగా, రోజు రోజుకు నగరంలో కేసులు…