Rajnath Singh: చైనాను ఉద్దేశించి భారత్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాలో మాట్లాడుతూ.. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్ ఏంటో చైనాకు అర్థమైందని అన్నారు. భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉందని, బలహీనమైన దేశం కాదని చెప్పారు. భారత దేశాన్ని ఎవరూ భయపెట్టి తప్పించుకోలేరని అన్నారు.
గతేడాది గాల్వన్ లోయలో చైనా సైనికులు పహారా కాస్తున్న భారత సైన్యంపై పదునైన ఆయుధాలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా చైనీయులు దాడి చేయడంతో దానికి భారత్ కూడా తగిన విధంగా బదులు చెప్పింది. ఈ రగడ తరువాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. గాల్వన్ భూభాగం తమదే అంటూ చైనా పదేపదే చెబుతూ వస్తున్నది. భారత్ దానికి ధీటుగా జవాబు ఇస్తూనే ఉన్నది. ఇటీవలే చైనా ఆరుణాల్ ప్రదేశ్ లోని 15…