మూడ్రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై చర్చిస్తారు. రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనుల సమీక్షకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే భేటీలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు…