గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కారు దిగేస్తారా? ఆమె పార్టీ మారిపోవడం ఖాయమైనట్టేనా? అదే నిజమైతే బీఆర్‌ఎస్ ముఖ్య నేత కే.కేశవరావు పరిస్థితి ఏంటి? తనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌కు హ్యాండిస్తారా? లేక తండ్రీ కూతుళ్లు చెరో పార్టీలో ఉంటారా? మేయర్ పార్టీ మార్పు కేంద్రంగా జరుగుతున్న రాజకీయం ఏంటి? వలస నేతల కోసం తెలంగాణ కాంగ్రెస్ గేట్లు తెరిచాక బీఆర్‌ఎస్ కారుకు కుదుపులు పెరిగిపోతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు బడా నేతలు…