ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్.. మరోసారి విపక్ష టీడీపీపై ధ్వజమెత్తారు. జగన్‌ని ఒంటరిగా ఎదుర్కోలేకే చంద్రబాబు దత్తపుత్రుడ్ని (పవన్ కళ్యాణ్) తీసుకొస్తున్నాడని విమర్శించారు. 2009లో వైఎస్‌ని ఎదుర్కోవడానికి మహాకూటమి పేరుతో అన్ని పార్టీలు ఏకమై బొక్కబోర్లాపడ్డాయని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్‌ని కదిలించలేరని చెప్పారు. సీఎం జగన్ ఎవరికీ అందనంత ఎత్తులో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని, రాజశేఖరరెడ్డి…