Gachibowli: హైదరాబాద్‌లో నిన్న కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు గచ్చిబౌలిలో పిడుగు పడింది. ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై భారీ శబ్దంతో పిడింది. భారీ శబ్దం రావడంతో జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. పిడుగు ధాటికి తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్ బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంకు చెందిన గోట్టివాడ చిన్న(35).. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు.. భార్యతో గోడవ కారణంగా కొంత కాలంగా గచ్చిబౌలిలో చేల్లెలు ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.