Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.