Today (20-02-23) Business Headlines: జీ20 విత్త మంత్రుల భేటీ: జీ20 దేశాల ఆర్థికమంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల మీటింగ్ ఈ నెలాఖరులో.. అంటే.. శుక్ర, శనివారాల్లో బెంగళూరులో జరగనుంది. జీ20 దేశాలకు ఇండియా అధ్యక్షత చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి సమావేశమిది కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ భేటీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో జరుగుతుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సహధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.