Minister Sridhar Babu: తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను పరిశీలన చేయడానికి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఫ్యూచర్ సిటీ (Future City) లోని సమ్మిట్ వేదికను సందర్శించారు. వేదిక ప్రాంగణంలోనే మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.…