Tata Motors: టాటా మోటార్స్ సంస్థ మరోసారి నిధుల సమీకరణ ప్రయత్నాలను మొదలుపెట్టింది. విద్యుత్ వాహనాల విభాగంలో వాటాల కేటాయింపు ద్వారా ఫండ్‌రైజ్ చేయనుంది. ఈ మేరకు వెల్త్ ఫండ్స్ మరియు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది. రెండేళ్ల కిందట బిలియన్ డాలర్లను సమీకరించిన ఈ కంపెనీ ఇప్పుడు కూడా బిలియన్ డాలర్లను సేకరించనుంది. ఈ నిధుల్లో ఎక్కువ శాతాన్ని అప్పులు తీర్చేందుకు వాడుకోనుంది. గతంలో ఈవీ మార్కెట్ వ్యాల్యూని 9 పాయింట్ 1 బిలియన్…