కరోనా ముంచుకు వస్తోంది. దేశవ్యాప్తంగా రోజూ లక్షలాదిమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తెలంగాణలోనూ కేసుల తీవ్రత కొనసాగుతోంది. అయితే, వీరికి నిరంతరం సేవలందిస్తూ వారి రికవరీకి ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు వైద్యారోగ్య సిబ్బంది. ఈ నేపథ్యంలో కరోనా క్లిష్ట సమయంలో అద్భుత మైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని ట్విట్టర్ లో అభినందించారు మంత్రి హరీశ్ రావు. కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన గర్బిణికి కరోనా సోకినా,నిర్మల్…
ప్రపంచాన్ని మరోసారి ఓమిక్రాన్ రూపంలో కరోనా భయపెడుతోంది. ఇప్పటికే 50 పైగా దేశాలకు వ్యాపించింది. 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అన్ని దేశాల్లో మరోసారి వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా.. బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు చేస్తున్నాయి పలు దేశాలు. ఇండియాలో కూడా బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకోవాలని పలు రాష్ట్రాలు, కేంద్రాన్ని కోరాయి. వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్…