Health Tip: నేటి హడావిడి, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ముఖ్యంగా, వర్కింగ్ కపుల్స్ వారాంతాల్లో కూరగాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్‌లో ఆహార పదార్థాలను ఉంచడం వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలామందికి నమ్మకం. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, పోషకాలు తగ్గిపోవడం…